దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

1
TMedia (Telugu News) :

దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

 

టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం పట్టపగలు స్థానికులు చూస్తుండగానే అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన రఘురెడ్డి కుల అహంకారంతో విగ్రహాన్ని ధ్వంసం చేయడం దళితుల మనోభావాలను ఛిద్రం చేయడమే అవుతుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గోర్ల.బాబురావు,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ద్యారపోగు సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఈ దోరల పాలనలో దళితులకు, దళిత వర్గానికి చెందిన విగ్రహాలకు, దళిత వర్గానికి చెందిన సమాదులకు రక్షణ లేదు.

Also Read : ఎన్సిడి మందుల కిట్ పంపిణీ

ఈ దోరల చేతిలో పాలన ఉన్నంత కాలం దళితులకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు పోలీసు యంత్రాంగం మొద్దు నిద్ర వీడి మన భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన రఘురెడ్డి పై చట్టపరమైన చర్యలతో శిక్షించాలని అలాగే అదే స్థానంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అవిష్కరించాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube