జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 31 వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరి రవీందర్ గౌడ్ పై ఇసుక అక్రమదారులు శనివారం రోజు దాడికి దిగారు. కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని శనివారం సమాచారం రావడంతో రవీందర్ గౌడ్ అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా తిరస్కరించారు. దాంతో మమ్మల్ని ఫోటోలు తీస్తావా అంటూ సెల్ ఫోన్ తీసుకొని అతనిపై దాడి చేశారు. సత్యనారాయణ రెడ్డి అనే టాక్టర్ యజమాని దాడి చేశాడు. ఈ దాడిని ఖండిస్తూ నాన్ అక్రిడేటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్(నాజా) ఆధ్వర్యంలో ఆదివారం పెబ్బేర్ ఎస్సై రామస్వామి కి వినతి పత్రం అందజేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలని వినతి పత్రంలో ఎస్ఐని కోరారు. ఈ కార్యక్రమంలో నాజా జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవి, ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ, నందీశ్వర్, గంగాధర్, శివ, ఉమా శంకర్ ,భరత్ కుమార్, మోతే, రఘు తదితరులు పాల్గొన్నారు.

Smugglers attacked Andhra Jyoti senior journalist Ravi Kumar.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube