ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో కనిపించిన గ్రహణ దృశ్యాలు

ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో కనిపించిన గ్రహణ దృశ్యాలు

0
TMedia (Telugu News) :

ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో కనిపించిన గ్రహణ దృశ్యాలు

 

టి మీడియా, ఏప్రిల్ 20,మెల్‌బోర్న్‌ : వాయువ్య ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో గురువారం ఉదయం పాక్షిక సూర్యగ్రహణం సందర్శకులను అలరించింది. వాయువ్య ఆస్ట్రేలియాలోని తీర పట్టణమైన ఎక్స్‌మౌత్‌లో మేఘాల మధ్య కొన్ని నిమిషాల పాటు అద్భుతమైన గ్రహణ దృశ్యాలు కనిపించాయి. అలాగే ఇండోనేషియా రాజధాని జకార్తా ప్లానిటోరియంలో కూడా పాక్షిక గ్రహణం కనిపించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్‌ మహా సముద్రం వరకు తీరం వెంబడి ఈ గ్రహణ దృశ్యాలు కనిపించినట్లు తెలిపారు. చాలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం, ఉంగరం (రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌) మాదిరిగా కనిపించాయని అన్నారు. ఇటువంటి సూర్యగ్రహణం దశాబ్దకాలంలో ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుందని, 2013లో ఇటువంటి గ్రహణం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తిరిగి 2031లో ఈ అద్భుత దృశ్యం కనిపించనుందని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ మధ్యలో, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సూర్యగ్రహణం అమెరికాలో కనిపించనుందని అన్నారు.

AlsoRead:మాకు న్యాయం చేయండి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube