ఆక్రమణ నాళాలు విషయంలో అధికారులు స్పందించాలి

ఆక్రమణ నాళాలు విషయంలో అధికారులు స్పందించాలి

0
TMedia (Telugu News) :

ఆక్రమణ నాళాలు విషయంలో అధికారులు స్పందించాలి
టీ మీడియా, ఏప్రిల్29, మధిర: మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాలలోని నాళాలు కబ్జాకు గురయ్యాయి..
మధిర మున్సిపాలిటీ పాలకవర్గం కానీ ,అధికారులు కానీ గత సంవత్సరం కురిసిన వర్షాలవలన మున్సిపాలిటీ పరిధిలోని అర్ వి కాంప్లెక్స్ నుండి వైస్సార్ విగ్రహం వరకూ సుమారు రెండడుగుల నీళ్లు నిలబడిన సంగతి మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదు. రాబోయే వర్షాకాలంలో మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న ప్రజలు.వైస్సార్ విగ్రహం దగ్గర కాలువ కబ్జాకు గురి అవ్వడం వలనే సుందరయ్య నగర్ నుండి, బంజారకాలని నుండి వచ్చే వరద డ్రైన్ లోకి వెళ్లకుండా రోడ్డు పైన ఆగిపోవడం జరుగుతుంది.అలాగే అండర్ బ్రిడ్జ్ క్రింద నుండి పోయే వాగు కబ్జాకు గురి అవడం కూడా ఒక కారణంగా ఉంది. రానున్న వర్షాకాలంని, ముంపుని దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే కబ్జాలనుండి నాలాలను రక్షించి మధిర మున్సిపాలిటీ ప్రజల్లోని వరద ముంపు భయాన్ని పోగొట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి

Also Read:.ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube