ఆటో మొబైల్ రంగంలో అపార అవ‌కాశాలు : మంత్రి కేటీఆర్

ఆటో మొబైల్ రంగంలో అపార అవ‌కాశాలు : మంత్రి కేటీఆర్

1
TMedia (Telugu News) :

ఆటో మొబైల్ రంగంలో అపార అవ‌కాశాలు : మంత్రి కేటీఆర్
టీ మీడియా,జూన్ 13,హైద‌రాబాద్ : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైద‌రాబాద్‌కు అపార అవ‌కాశాలున్నాయ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థ‌ను మంత్రి కేటీఆర్ సోమ‌వారం ప్రారంభించారు. అమెరికాకు చెందిన అగ్ర‌శ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైద‌రాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డాన్ని కేటీఆర్ స్వాగ‌తించారు.

Also Read : ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హైద‌రాబాద్‌లో వ్యాపారాల‌కు అద్భుత అవ‌కాశాలు ఉన్నాయ‌ని మంత్రి వివ‌రించారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ఫార్ములా-ఈని ప్రారంభించ‌బోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ‌ను 65 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube