అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీం స్టే
టీ మీడియా, ఏప్రిల్ 21, న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తనను సీబీఐ అరెస్టు చేయవచ్చన్న అనుమానంతో తెలంగాణ హైకోర్టు లో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వరకు ఎలాంటి అరెస్టులు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత నిన్న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అవినాశ్‌కు బెయిలిస్తే విచారణపై ప్రభావం పడుతుందని సీబీఐ న్యాయవాది వాదించారు. వివేకా హత్యకేసులో ప్రలోభాలు కూడా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు . ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ సోమవారం వరకు అన్ని విషయాలను పరిశీలిస్తామని అప్పటి వరకు అవినాశ్‌ను అరెస్టు చేయవద్దని సీబీఐను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు విచారణపైనా కూడా సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు సైతం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పింది. సోమవారం మరోసారి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
AlsoRead:ఈ వస్తువులు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube