విద్యార్థినిలు లక్ష్యసాధన తో ముందుకెళ్లాలి

షీ టీం జిల్లా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కిరణ్

1
TMedia (Telugu News) :

విద్యార్థినిలు లక్ష్యసాధన తో ముందుకెళ్లాలి

-షీ టీం జిల్లా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కిరణ్

టీ మీడియా ,జూలై22,జగిత్యాలప్రతినిధి:
విద్యార్థిను లు లక్ష సాధన తో ముందుకెళ్లాలని షీ టీం జిల్లా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కిరణ్ సూచించారు. గురువారం నూకపల్లి మోడల్ స్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు హక్కులు , రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన, ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని స్కూల్లో, కళాశాలలో, బస్టాప్ ఇతర నిర్మాణ ప్రాంతాలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షీ టీం పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 7330711080 కు లేదా డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 175 హాట్ స్పాట్ లను గుర్తించి అట్టి ప్రాంతాల్లోమఫ్టీలో పోలీస్ నిఘా ఉంచి అమ్మాయిలను,స్త్రీలను ఎవరు వేదించకుండా ,ఒకవేళ ఎవరైనా వేదించినట్లైతే వారిని తక్షణమే పట్టుకొని వారికీ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి,కేసు నమోదుచేసి వారి పై చర్యలు తీసుకుంటుంటామని అన్నారు. ప్రస్తుత ఉన్న రోజు ల్లో సెల్ఫోన్లో వినియోగం ఎక్కువైందని దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందన్నారు. సోషల్ మీడియాకు అలవాటు పడి సమయం వృధా చేసుకోవద్దన్నారు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అదేవిధంగా షీటీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు, చదువుపై శ్రద్ధ, గోల్డ్ సెట్టింగ్ పై అవగాహన కల్పించారు.

 

Also Read : నిఘా నేత్రం నీడలో పెద్దపల్లి

 

ఈ కార్యక్రమంలో నూకపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత దేవి, షీ టీమ్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు , ఏ ఎస్ ఐ వాలీబెగ్, మహిళా కానిస్టేబుల్స్ సౌజన్య, పూజిత మరియు నూకపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube