మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థికి సన్మానం

మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థికి సన్మానం

1
TMedia (Telugu News) :

మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థికి సన్మానం

టీ మీడియా, డిసెంబర్ 5, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణానికి చెందిన 30వ వార్డు ఐజయ్య కాలనీ నివాసి రవికుమార్ రెడ్డి, శిల్పారెడ్డి కూతురు గాయత్రి రెడ్డి మెడిసిన్లో 2003 ర్యాంకును సాధించి రామగుండం గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఐజయ కాలనీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు.

Also Read : మసీదులో కాల్పులు, ఇమామ్‌ సహా 12 మంది మృతి

ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని గాయత్రిని అభినందించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మార్వో కృష్ణయ్య, రాధాకృష్ణ,రాజు, వెంకటేశ్వర్లు, టీచర్ కొండ శ్రీనివాస్ గౌడ్, రామ్మూర్తి మోహన్ రెడ్డి, బాల్రెడ్డి, రాబర్ట్, వెంకటరమణ, భరత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube