ఉత్తమ డాక్టర్ కి సన్మానం

ఉత్తమ డాక్టర్ కి సన్మానం

1
TMedia (Telugu News) :

ఉత్తమ డాక్టర్ కి సన్మానం

టీ మీడియా, జూలై 8, వనపర్తి బ్యూరో : దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తమ పెడియట్రిక్ సర్జన్ (ఆపరేషన్ )డాక్టర్ గా అవార్డు పొందిన వనపర్తి జిల్లా సూపరిడేంటెంట్ డాక్టర్ నరేంద్రకుమార్ కి వారి ఆఫీసులో గురువారం అఖిలపక్ష ఐక్యవేదిక ద్వారా ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ నుండి మొదటిసారిగా పెడియట్రిక్ సర్జన్ గా 30 వేల ఆపరేషన్లు చేసిన రికార్డుతో అవార్డు తెచ్చుకోవడం జరిగింది.

 

Also Read : గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

నీలోఫర్ హాస్పిటల్ లోని 22 సంవత్సరాలుగా పని చేసి, మిగతా 8 సంవత్సరాల వివిధ హాస్పిటల్లో పనిచేసిన రికార్డు నరేంద్ర కుమార్ కి ఉందని తెలిపారు. మాజీ కౌన్సిలర్ మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ నరేంద్రకుమార్ వనపర్తికి రావడం మా అదృష్టం అని వారి సేవలతో వనపర్తి పులకరిస్తుందని చెప్పారు.
ఈ సన్మాన కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక కోకన్వీనర్ చిరంజీవి, మాజీ కౌన్సిలర్ కొండన్న, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి షపి, వైయస్సార్ పి సతీష్. గంధం నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube