గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సన్మానం

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సన్మానం

1
TMedia (Telugu News) :

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సన్మానం

టీ మీడియా, ఆగస్టు 22, వనపర్తి బ్యూరో : జడ్చర్ల లో ఆదివారం నిర్వహించినటు వంటి 9వ సిఎల్ఆర్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ యందు వనపర్తి కి చెందిన గోజురియో కరాటే, కిక్ బాక్సింగ్ అకాడమికి చెందినటువంటి అయిదుగురు విద్యార్థులు పాల్గొని వారి వారి యొక్క ప్రతిభను కనపర్చడం జరిగిందని.దానిలో భాగంగా నాలుగు బంగారు పథకాలు,ఒకటి రజత పథకం సాధించిన,కొంకలి జయకృష్ణ,కొంకలి కృష్ణ చైతన్య, గొనె రుద్ర,కె.విశాల్,సాయి చంద్ర విద్యార్థులను, అఖిలపక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు జి.సతీష్ యాదవ్ , చంద్రమౌళి,వెంకటేష్,రమేష్, ఆంజనేయులు అడ్వకేట్ లు సన్మానించి అభినందించడం జరిగింది.

Also Read : ఎంపీ రఘురామపై తీవ్ర చర్యలు తీసుకోవద్దు

అలాగే బీదవాడు అయిన శేఖర్ తల్లి తండ్రులు చిన్నప్పటి నుండి కులిపనితో పెంచి ఒక ప్రయోజకునిగా పెంచారని తాను కష్టపడుతూ వచ్చిన డబ్బులతో కరాటే నేర్పిస్తూ సేవ చేస్తున్న శేఖర్ ను అఖిలక్ష ఐక్యవేదిక ఈ సంధర్భంగా అభినందిస్తూoదని సతీష్ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ శేఖర్, శివకృష్ణ యాదవ్,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube