ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన సదస్సు
టీ మీడియా, ఫిబ్రవరి 14, జన్నారం : ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని రేండ్లగూడ గ్రామంలో మంగళవారం రోజున మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి అనిత రైతులకు ఆయిల్ ఫామ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించరు.దానిలో భాగంగా నీరు నిల్వ ఉండే నెలలు తప్ప మిగిలిన అన్ని భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయని, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వయసుగల మొక్కలు నాటుకు అనుకూలంగా ఉంటాయని, ఎకరానికి 57 మొక్కల చొప్పున 9 9 9 దూరంలో త్రిభుజాకార పద్ధతిలో పెట్టి నాటుకోవాలని తెలిపారు. అలాగే నాలుగు సంవత్సరాల నుండి దిగుబడితో ఆదాయం మొదలవుతుందని మూడు సంవత్సరాల వరకు ఈ పంటలు అంతర్పంటగా అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు అని రైతులకు వివరించారు…
Also Read : ఇంటింటికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.
గ్రామంలో గల వేరుశనగ, అంతర్ పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రేండ్లగూడ సర్పంచ్ ఆశరాజ్ , పంచాయతీ కార్యదర్శి ,మాట్రిక్స్ సీఈఓ ఉదయ్ ,జన్నారం క్లస్టర్ ఏ ఈ ఓ త్రి, మాట్రిక్స్ మల్లేష్ , రైతులు తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube