వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు అవగాహన

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని భట్టుపల్లి రైతు వేదిక నందు కరకగూడెం ఎంపిడిఓ,ఎంపీవో అధ్యక్షతన జరిగిన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు ఐ టి సి బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం వారు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… హరిత రాయబారులకు తడి పొడి ప్రమాదకర చెత్త పై అవగాహన కల్పించారు.తడి చెత్తతో ఎరువుగా మార్చుకునే విధానం ప్రొజెక్టర్ ద్వారా చూపించారు.అదేవిధంగా హరిత రాయబారులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎం పీ ఓ చిరంజీవి,16 పంచాయితీల హరిత రాయబారులు,ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ,వాష్ ప్రోగ్రాం ఏ పి ఓ ఆత్రేయ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు,ట్రైనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Awareness for green ambassadors on waste management.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube