బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

1
TMedia (Telugu News) :

బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

టి మీడియా, అక్టోబర్, 19, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మెట్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన 16 మంది సభ్యులతో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ కమిటీలను ఏర్పాటు చేశారు.బాలల సంరక్షణ ధ్యేయంగా ఈ కమిటీలు పనిచేస్తాయని, ఈ కమిటీ చైర్మన్లుగా స్థానిక సర్పంచ్ ములకల శోభ, కార్య దర్శిగా పంచాయతీ కార్య దర్శి గాయత్రి కన్వీనర్ గా స్థానిక అంగన్వాడీ టీచర్లు దీపిక వ్యవహరించనున్నట్లు షేక్ మోహీనొద్దిన్ తో కలిసి రాజకొమురయ్య తెలిపారు.

Also Read : కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

ఎవరైనా బాలల హక్కులకు భంగం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపియు సోషల్ వర్కర్ ఎం. శైలజ, పాఠశాల ఉపాధ్యాయురాలు లలిత, గ్రామ పోలీస్ అధికారి సంపత్, ఆశ వర్కర్ తిరుపతమ్మ,విఆర్ఎ మహేశ్వరి, రమాదేవి, రజిత శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube