బాలికలపై జరుగుతున్న నేరాలు పట్ల అవగాహన

బాలికలపై జరుగుతున్న నేరాలు పట్ల అవగాహన

1
TMedia (Telugu News) :

బాలికలపై జరుగుతున్న నేరాలు పట్ల అవగాహన
టి మీడియా,సెప్టెంబర్20, కరీంనగర్:
నేటి కాలంలో బాల బాలికలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ షీ టీమ్స్ ఏఎస్ఐ విజయమణి అన్నారు.మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ,ఐపీఎస్ అదేశాల మేరకు టవర్ సర్కిల్ వద్దగల గవర్నమెంట్ గంజ్ హై  స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ విజయమణి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాలయాలకు పోయి వచ్చేటప్పుడు,బయట ప్రయాణాలు చేసేటప్పుడు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, ఈవ్టీజింగ్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని,సైబర్ నేరాలపై అవగాహన కలిగిఉండాలని అన్నారు.

 

Also Read : అకాడ అకాడతో ఆత్మరక్షణ

విద్యార్థులు ఎవరి నుండైన ఇబ్బందులకు గురైనప్పుడు,ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచారం ఇవ్వాలని,పిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామని అన్నారు.విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని,అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలోనే కట్టడి చేసి అఘాయిత్యాలను అరికట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఏఎస్ఐ విజయమణి,షీ టీమ్ సభ్యులు,పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube