పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన

0
TMedia (Telugu News) :

టి మీడియా,నవంబర్23,కరీంనగర్ జిల్లా
విమెన్  సేఫ్టీ  వింగ్,షీ టీమ్స్ సంయుక్తంగా ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మంగళవారం  కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా అన్ని మండలాలలో ఒకే రోజు 50 పాఠశాలలో సైబర్ క్రైమ్స్, సోషల్ మీడియా నేరాలు,పిల్లలు మరియు ఆడవాళ్ళపై జరుగుతున్న నేరాలు వాటి శిక్షల గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎస్ కార్ఖానాగడ్డ పాఠశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ ఎంఈఓ మధుసూదనాచారి,ప్రత్యేక ఆహ్వానితులుగా జిసిడిఓ కృపారాణి,షీ టీం ఏఎస్ఐ విజయమణి,షీ టీం సిబ్బంది,మండల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లతో పాటు ఆయా గవర్నమెంట్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Awareness on cyber crime in school .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube