ఘనంగా సిఎం జగన్ జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 21, మహానంది:

మహానంది మండలం అబ్బీపురం గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపిపి కుమారి బుడ్డారెడ్డి యశస్విని పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చెట్టు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపిపి యశస్విని మాట్లాడుతూ పేద బడుగు బలహీనవర్గాల ప్రజలందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో బృహత్తరమైన నవరత్నాలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని వర్గాల ,అన్ని కుల మతాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైయస్సార్ సిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Awareness on omicron virus

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube