లింగ వివక్షత పై అవగాహన కార్యక్రమం
టీ మీడియా, డిసెంబర్ 16, మహబూబాబాద్ : శుక్రవారం ఎస్పి సార్ గారి ఆదేశం అనుసారంగా, సి సి ఎస్ సిఐ ఆధ్వర్యంలో నందు ప్రీ-కాన్సెప్షన్ & ప్రీ-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్1994, లింగ వివక్షత ఉద్యమం నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 గల షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జనరల్ ఆస్పత్రి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో షీ టీం,AHTU, చైల్డ్ లైన్ భరోసా పాల్గొనడం జరిగింది.ఈ ప్రోగ్రాంలో ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ పిటిషన్ మరియు సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మరియు ఫోక్సో చట్టాల గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది. షీ టీం ఏఎస్ఐ ఆనంద్,HC మసూద్ సార్, డబ్ల్యూపిసి అరుణ, పార్వతి, AHTU కానిస్టేబుల్ ఊర్మిళ, భరోసా జయశ్రీ, రేణుక, చైల్డ్ లైన్ ఉమ, శ్రీలత, కల్యాణి, అనిల్ తదితరులు పాల్గొనడం జరిగింది.