టీ మీడియా, డిసెంబర్ 8, మహానంది:
మహానంది గ్రామంలో మా బోర్డు టిఐ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రామ క్రిష్ణ గురుకుల పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, మరియు ఉపాధ్యాయులు బుధవారం హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం, ర్యాలీని నిర్వహించారు. అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎలా వ్యాప్తి చెందుతుంది మరియు టిబి ఒక అంటు వ్యాది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని బిడబ్లు ఆర్డియస్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట సుబ్బయ్య, గ్రామ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ క్రిష్ణ మోహన్, హెడ్ మాస్టర్ కెసి బాలిరేడ్డి, ఉపాధ్యాయులు వేంకటేశ్వర్లు, క్రిష్ణయ్య, సుబ్బారావు, ఏఎన్ఎం మాధవి, ఒఆర్ డబ్లు సుధా, తదితరులు పాల్గొన్నారు.