పొడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని అవగాహన సదస్సు

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్7, వెంకటాపురం :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో గల ప్రభుత్వ అతిథి గృహం నందు
పొడుభూములకు హక్కు పత్రాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్ అర్ సి కమిటీల్లో రాజకీయ పార్టీల జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధికారులను డిమాండ్ చేసారు. మండల కేంద్రం లో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవర్ణలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దావూద్ హాజరై మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పొడుభూములకు హక్కు పత్రాలు ఇస్తున్నట్లు చూపిస్తూ,

అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టుతుందని ఆరోపించారు. ఎఫ్ఆర్సి కమిటీల వారిగా వేయాలని, కమిటీలలో రాజకీయ నాయకులు జోక్యం లేకుండా అధికారులు చూడాలని కోరారు. మండలంలో పొడుభూములకు హక్కు పత్రాలు కల్పించే ఎఫ్ఆర్సి కమిటీలు తెరాస పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. అమాయక ఆదివాసీలను మండల రెవెన్యూ అధికారులు తెరాస పార్టీ నాయకుల ఒప్పందం కుదుర్చుకుని ఆదివాసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఆర్సి కమిటీలు పారదర్శకంగా నిర్వహిచాలని లేని పక్షంలో పొడు సాగుదారుల ఐక్యం చేసి పోరాటాల ద్వారా తెరాస ప్రభుత్వ కుటీల బుద్దికి తగిన గుణపాఠం చెబుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జెజ్జరీ దామోదర్, వంకా రాములు, సీపీఎం నాయకులు గ్యానం వాసు, గుండమళ్ల ప్రసాద్, కారం వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు,

Awareness seminar on land tittle deeds
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube