కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 7 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఎన్ రోలర్స్ అవగాహన సదస్సు బుధవారం రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఇట్టి కార్యక్రమానికి టిపిసిసి సభ్యత్వ నమోదు వేణుగోపాల్ మాజీ మంత్రి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి టిపిసిసి శిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మరియు టిపిసిసి సోషల్ మీడియా చైర్మన్ జాన్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ శ్రీనివాస్గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి పట్టణ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ అభిలాష్ పాల్గొన్నారు. టిపిసిసి సోషల్ మీడియా చైర్మన్ దీపక్ జాన్ వనపర్తి జిల్లా కు మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అశోక్ శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

చిన్నా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న బూత్ లెవల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ప్రతి బూతులో వందమందిని సభ్యత్వం నమోదు చేయించాలి .కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేయించుకుంటే ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది కావున సభ్యత నమోదు చేయించే వారికి తెలియజేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి బూతులో వంద మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించి రేపు జరగబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో సత్య రెడ్డి మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ చీర్ల జనార్ధన్ చంద్రమౌళి వెంకటేష్ దివాకర్ త్రినాధ్ రాములు యాదవ్ అశోక్ శ్రీనివాస్ గౌడ్ విజయవర్ధన్ రెడ్డి బ్రహ్మం యాదగిరి మధుసూదన్ గౌడ్ రమేష్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మయ్య విజయ్ అబ్దుల్లా పర్వతాలు ఈ శిక్షణ కార్యక్రమానికి సభ్యత నమోదు చేయడానికి ఎన్ రోలర్ అయినా ఎన్రోలర్ కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు దివ్యాంగులు బ్లాక్ కాంగ్రెస్ యువజన నాయకులు మైనారిటీ నాయకులు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ యువజన నాయకులు మహిళలు సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Awareness seminar under the auspices of the Congress party.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube