ప్రజల కు ఆర్టీసీ బస్సు వినియోగించుకోవాలి అని అవగాహన కల్పిoచారు

ప్రజల కు ఆర్టీసీ బస్సు వినియోగించుకోవాలి అని అవగాహన కల్పిoచారు

1
TMedia (Telugu News) :

ప్రజల కు ఆర్టీసీ బస్సు వినియోగించుకోవాలి అని అవగాహన కల్పిoచారు

టీ మీడియా ,సెప్టెంబర్24 ,ముత్తారం : ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని.. ప్రజల వద్దకు ఆఫీసు సేవలు వస్తున్నాయని ఆర్టీసీ మంథని డిపో మేనేజర్ గ్రామ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల పరిధిలోని ముత్తారం గ్రామం ,ఓడేడ్ ,అడవిశ్రీరాంపూర్ గ్రామాలలో ఆర్టీసీ ఇడి వెంకటేశ్వర్లు పిలుపు మేరకు మంథని డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకే ఆర్టీసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆర్టీసీ కళాకారులచే ఆర్టీసీ సేవలు,రాయితీలపై ఆట పాట మరియు నాటక ప్రదర్శన రూపంలో ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడం జరిగింది.

 

Also Read : మంత్రి పువ్వాడ అజయ్‌ కు ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశంస

ఈ కార్యక్రమంలో అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతారానిబాలాజీ మాట్లాడారు. డిపో మ్యానేజర్ కు వినతి పత్రం అందజేశారు.ఇదే క్రమంలో ఓడేడ్ గ్రామస్థులు జమ్మికుంట బస్సు సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని డిపో మానేజర్ ను కోరారు.ఆర్టీసీ బస్సులో శిక్షణ పొందిన డ్రైవర్లు బస్సులు నడపడం వలన క్షేమంగా గమ్యాస్తానాలు చేరుతారని డిపో మేనేజర్ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డిపో మానేజర్ శ్రీనివాస్ తో పాటు టి 12 మహేష్,,ఎస్ డి ఐ గోపాల్,కండక్టర్ శ్రీనివాస్,పీహెబి డ్రైవర్ మహేష్ మరియు ఆర్టీసి సిబ్బంది,కళాకారులు,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube