దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

1
TMedia (Telugu News) :

దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

టీ మీడియా, మే12, మహానంది:

మహానంది మండలం లోని మహానందిలో గురువారం ఎస్ ఐ నాగార్జున రెడ్డిఆధ్వర్యంలో దిశా యాప్ పై మహానంది ఏ ఎస్ఐ లు సుబ్బయ్య ,కృష్ణుడు అవగాహన కల్పిస్తు అలాగే దిశా యాప్ లేని కొందరి చరవానిలో డౌన్లోడ్ చేసి చూపించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ ఐ లు సుబ్బయ్య, కృష్ణుడు, మాట్లాడుతూ మహిళల రక్షణకై దిశ యాప్ పై మహానంది పోలీస్ లు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Also Read : వివాహ శుభకార్యాలకు హాజరైన ఎంపీ నామ

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ ను అందరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి దానివలన ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలకు ఎక్కడ ఆపద వచ్చినా యాప్ ఉన్న మొబైల్ ఫోన్ అటు ఇటు ఊపగానే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్లి వారి నుండి రక్షణ కలుగుతుందన్నారు. మహిళలు తమను తాము రక్షించుకోవడం కోసం దిశ యాప్ ను వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆ సేవలు కూడా పొందాలని వారు ప్రజలకు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube