వాహనదారులు కు అవగాహన

టీ మీడియా, మార్చి 9, భద్రాచలం

1
TMedia (Telugu News) :

వాహనదారులు కు అవగాహన
టీ మీడియా, మార్చి 9,
భద్రాచలం:
భద్రాచలం టౌన్ లో ఏ ఎస్ పి రోహిత్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు ప్రభుత్వం కల్పించిన వాహన రాయితీలను వినియోగించుకోవాలని కోరారు.

Also Read :  ఆర్టీసీ బస్సులు నడపాలి

తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అదేవిధంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని అలా నడిపితే కుటుంబాలకు దూరం కావడమే కాక తోటి ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం వాహన దారుల తో మద్యం సేవించి వాహనం నడపమని, హెల్మెట్ ధరించి వాహనము నడుపుతామని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు వారి సిబ్బంది మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, పలు వాహనాల కేసులో పట్టుబడ్డ డ్రైవర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube