జమాల్ ఖాన్ కు  ఆయుర్వేద వైద్య రత్న అవార్డు

 జమాల్ ఖాన్ కు  ఆయుర్వేద వైద్య రత్న అవార్డు

0
TMedia (Telugu News) :

 జమాల్ ఖాన్ కు  ఆయుర్వేద వైద్య రత్న అవార్డు

 

టీ.మీడియా ఆగస్ట్20.చింతూరు: పారం పర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో జాతీయ సాంప్రదాయ వైద్యుల శిక్షణ కార్యక్రమము. . నేషనల్ ట్రెడిషనల్ హాలర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 18.,19,20 తేదీల్లో గుంటూరు జిల్లా , అమరావతి , తాళాయపాలెంలోని శైవ క్షేత్రము లో నిర్వహించబడినది. ఈ సమావేశంలో దక్షిణ భారతదేశంలోని సాంప్రదాయ వైద్యులు అందరూ పాల్గొని వివిధ రకములైన రుగ్మతలకు తాత్కాలిక దీర్ఘకాలిక ఉపశమనము నిర్మూలన అంశాల పైన వారి యొక్క అనుభవ విధానాలను ఒకరి నుండి ఒకరు తెలుసుకున్నారు. సమాజానికి ఆరోగ్య వారతావానికి కాలుష్య రహిత జీవనానికి పర్యావరణ పరిరక్షణకు ఈ పారంపర్య వైద్య సంఘ సభ్యులు పాటుపడాలని వారి యొక్క సందేశాన్ని తెలియజేశారు .ఈ సందర్భంగా వృద్ధులైనటువంటి 70 సంవత్సరములు పైబడిన గురువులకు సన్మానం చేశారు.

ALSO READ :చ ట్టం నర్సరీ వారికి చుట్టం

 

ఆంధ్రప్రదేశ్లోని కరోనా మందు ఇచ్చిన ఆనందయ్య ని,ప్రముఖ మూలికా వైద్యులు ఎండి జమాల్ ఖాన్ ని మరియు నెల్లూరుకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ని ఫారంపర్య వైద్యరత్న అవార్డుతో పాటు ధన్వంతరి స్వామి పంచలోహా విగ్రహాన్ని బహుకరించారు. వీరి సేవలకు గుర్తింపుగా పరంపర్య వైద్య మహా సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డాక్టర్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు కాలంలో ఆయుర్వేదమే మానవాళికి నింపుతుందని ఆయుర్వేద ఔషధ మొక్కలను కాపాడి భావితరాలకు రోగ రహిత సమాజాన్ని అందించేలా ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి విలువైన ఔషధ మొక్కలు కోల్పోయామన్నారు. రోజురోజుకు మనిషి పై విస్తృంభిస్తున్న నూతన రోగాల బారిన పడి ఆయు ప్రమాణం తగ్గిపోయిందని రాబోయే కాలంలో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని మొండి రోగాలను తరిమికొట్టే ఆయుర్వేద వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సమావేశానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పారంపర్య మహా సంఘం కోశాధికారి బాలకృష్ణ. నిర్వహణ అధికారి రామకృష్ణరాజు కార్యనిర్వహకులుగా ఉన్నారు. ఆఫ్రిన్ ఆయుర్వేద వైద్య సల నుండి సిబ్బంది మరియు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ ఎండి ఇమ్రాన్ ఖాన్ సభ్యులు నాధర్ఖాన్, అబ్రార్ ఖాన్, మరియు ఆశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సయ్యద్ సుబహాని, సిబ్బంది రాచూరి శేఖర్. భవాని, పాష, ఎస్.కె. షాజహాన్, ఎస్ కె సుబహని తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube