పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 23 వనపర్తి : వనపర్తి పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రజా వైద్యశాల వెనుక పార్కునందు జరుగుతుంది. ముత్తుకృష్ణ గురుస్వామి కాగితాల లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న అయ్యప్ప స్వామి పూజకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులతో పాటు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ తో పాటు వేలాది మంది భక్తులు అయ్యప్పలు పాల్గొంటారు. గోవింద్ రెడ్డి గురు స్వామి హైదరాబాద్ రఘుమారెడ్డి గురుస్వామి కరమలములచే పూజ నిర్వహించబడును. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభిషేక పూజా కార్యక్రమంలో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తుకృష్ణ గురుస్వామి, లక్ష్మీనారాయణ, వెంకన్న, రాజేష్, మధు, భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube