బీటెక్‌ విద్యార్ధి అనుమానాస్పద మృతి

టి మీడియా, ఎప్రిల్ 18,గుంటూరు

1
TMedia (Telugu News) :

బీటెక్‌ విద్యార్ధి అనుమానాస్పద మృతి
టి మీడియా, ఎప్రిల్ 18,గుంటూరు: బీటెక్‌ విద్యార్ధి చంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డోకిపర్రులో ఓ కాలేజ్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. కాలేజీ సమీపంలోని రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం లభ్యమైంది. చంద్రయ్య స్వస్థలం పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం, అరెపల్లి. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కాలేజ్‌కు వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రయ్య మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నరసరావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట చంద్రయ్య బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

 

also read ; మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో: జగ్గారెడ్డి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube