బాంబు లాంటి వార్త చెప్పిన బాయిల్డ్ రైస్ మిల్లర్లు

బాంబు లాంటి వార్త చెప్పిన బాయిల్డ్ రైస్ మిల్లర్లు

0
TMedia (Telugu News) :

-జనవరి 1 నుండి లాకౌట్

-తెలంగాణ వ్యాప్తంగా 2లక్షల మంది ఉపాధి గల్లంతు

-ఉద్యోగులు, కార్మికులు కు నోటీసులు ఇచ్చిన యాజమాన్యాలు

టి మీడియా,డిసెంబర్ 22, ప్రత్యేకప్రతినిధి:

కేంద్రం బాయిల్డ్ రైస్ వద్దన్న ఫలితం వరిసాగు రైతుల పైనే కాదు.అనుబంధ రంగాల కు చెందిన వారిపై కూడా తీవ్రంగా ఉంది . వడ్లు లేవు, వచ్చేది లేదు,మీకు పనిలేదు, అంటూ ఉద్యోగులు,కార్మికులు కు నోటీస్ లు ఇచ్చినఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు యజమానులు, 2022 జనవరి1 నుండి మూసి వేస్తున్న ట్లు ప్రకటించారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్న సుమారు 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు వీరి లో 30 ఏళ్ల నుండి బాయిల్డ్ రైస్ మిల్లు లో పని చేస్తున్న వారు ఉన్నారు.వారిలో కొంతమంది కి ఉద్యోగ అనంతరం రు20 వెల నుండి 30 వేల రూపాయలు మాత్రమె పీఎఫ్ పొందే అవకాశాలు ఉన్నాయి.మే మెట్ల ఇక బ్రతకాలి అని పలువురు టి మీడియా ఎదుట వాపోయారు.వయస్సు అంత మిల్లులో గడి చి పోయింది.నా కుటుంబాన్ని ఇప్పుడు ఎలా పోషించు కోవాలి అని ఖమ్మం నగరానికి చెందిన మిల్లు గుమస్తా ఒకరు అన్నారు..ఆయన ప్రస్తుత వయస్సు 58 ఏళ్ళు.30 ఏళ్ళు గా నగరంలో ని ప్రముకుడి బాయిల్డ్ రైస్ మిల్లు లో పని చేస్తున్నడు. యాజమాన్యం తొలగింపు నోటీస్ ఇచ్చింది. పీఎఫ్ సెటిల్ మెంట్ కి వెళితే 30 వేలు వరకు వచ్చే అవకాశం ఉంది అని తేలింది. బిడ్డ పెళ్లికి ఉంది.పిల్లవాడు చదువు మధ్య లో ఉంది.వేరే పని రాదు.ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు.

వేయ్యి మిల్లులు

తెలంగాణ వ్యాప్తంగా 1000 వరకు బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి.ఒక్కో దాని పై 200ల మంది సగటున ఉపాధి పొందుతున్నారు. 2014 వరి సాగు, ఉత్పత్తి పెరిగింది దీనితో మరో 250 మిల్లులు 2014 తరువాత వచ్చాయి అని ,ఒక్కో దానికి 15 కోట్లు వరకు పెట్టుబడి అయింది అని.ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు అశోషియేషన్ నాయకులు తెలిపారు.ఖమ్మం జిల్లాలో మొత్తం 8 మిల్లులు ఉన్నాయి.వాటిలో నగరం లో 3 ఉన్నాయి.మొత్తంలో 2 మిల్లులు 2014 తరువాత ఏర్పాటు అయినవి కూడా ఉన్నాయి.ఇవి అన్ని మూసి వేయడానికి రంగం సిద్ధం అయింది.
సిబ్బంది వీరే

మిల్లు నిర్వహణలో మిల్లు డ్రైవర్లు,గుమస్తాలు, శాశ్వత కూలీలు(హమాలీలు కారు),తాత్కాలిక కూలీలు,పర్య వేక్షకులు, వాచ్ మెన్ లు, టెక్నీషియన్ లు తదితరులు కీలకం.వీరి అందరికి యాజమాన్యం ఉద్యోగులు గా గుర్తించి నెలవారి వేతనాలు ఇస్తుంది.వీరి అందరి ని తొలగిస్తున్నారు.వీరు కాక,రవాణా డ్రైవర్లు, హమాలీలు, క్లినర్లు ఇలా మరికొంతమంది ఉంటారు మిల్లు నడవని కారణంగా వీరు అందరి పని ఉండదు.

బాయిల్డ్ రైస్ తో బహుళ ప్రయోజనము
బాయిల్డ్ రైస్ అన్నం తినడం వల్ల మనుషులకు బహుళ ప్రయోజనం ఉంది అని నిపుణులు పేర్కొంటున్నారు.క్యాలరీస్ ఎక్కువ గా ఉంటాయి,త్వరగా జీర్ణం అవుతుంది, షుగర్ ఉన్న వారికి నిరోధక శక్తిని పెంచుతుంది లాంటి అనేకం ఉన్నాయి

బాయిల్డ్ ఎందు కంటే

కేంద్రం ధాన్యం కాకుండా ఎఫ్ సి ఐ ద్వారా బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తుంది.అదికూడా ఈ సారి మేము సూపర్ ఫైన్ (సన్న రకం)రకం కొనుగోలు చేస్తము అన్నది. యసంగి లో మొద్దు రకం మాత్రంమే దిగుబడి మంచిగా ఉంటుంది.తెగుళ్లు ను తట్టు కొంటుంది..అయితే ఈ వడ్లను నేరుగా మిల్లులో ఆడిస్తే నూకలు అవుతాయి.అందుకోసం వడ్లను బాయిల్డ్( వేడి నీళ్ల లో ఉడక బెట్టడం) మిల్లుకు పంపుతారు.అక్కడే ఉడికించి .ఎండ పెడతారు.అటు తరువాత సాధారణ మిల్లు లోఆడించి బియ్యం చేస్తా రు..బియ్యం ప్రభుత్వం ఎఫ్ సి ఐ కి కేంద్రం అనుమతి తో ఇస్తుంది.మాకు బాయిల్డ్ వద్దు,లావులు వద్దు సన్న రకాలు కావాలి అంటుంది కేంద్రం.ఏ రకం అయిన బాయిల్డ్ చెయ్యకుండా వేసంగి ఉత్పత్తి మాత్రం మిల్లింగ్ చేస్తే నూకలు అవుతాయు.దీనితో తెలంగాణ లో వరి వేసంగి లో వద్దు అనేది ప్రభుత్వం చెపుతోంది

కార్పొరేట్ శక్తుల కు అవకాశం

నీటి వనరులు అభివృద్ధి చెందిన తెలంగాణ పై ఇప్పటికే కార్పొరేట్ సంస్టలు కన్ను వేసాయి.పరోక్షంగా వ్యవసాయ లో ప్రవేశించిన వారు నేరుగా వచ్చే ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం రంగాన్ని కార్పొరేట్ వశం కోసం జరుగుతున్న ప్రయత్నాలు భాగం వరి సాగు,ఉత్పత్తి కొనుగోలు పై ఆంక్షలు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube