అయోధ్య రామయ్య మందిరానికి బాహుబలి గంట..
లహరి, ఫిబ్రవరి 17, అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువులు రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సరయు నదీ తీరంలో రాములోరి మందిర నిర్మాణం చకచకా జరుగుతోంది. 2024 లో ఆలయ నిర్మాణం పూర్తై.. భక్తుల దర్శనానికి సిద్ధం కానుంది. రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని, భక్తులకు ఆలయాన్ని సందర్శించవచ్చునని మంది నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మరోవైపు రామయ్య ఆలయంలో ఏర్పాటు చేయనున్న గంట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తయారు చేయించింది అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యూపీలోని జలేసర్ మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మిట్టల్ కర్మాగారంలో తయారైన ఈ గంట ఇప్పటికే ట్యూటికోరిన్ నుంచి అయోధ్యకు భారీ క్రేన్ సాయంతో తరలి వెళ్ళింది.రామాలయంలో నెలకొల్పే 2100 కిలోల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారనుంది.. ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గంటను ఇక్బాల్ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు రూపకల్పన చేశారు.
Also Read : శివయ్య వేషధారణ రహస్యాలేంటి…
ఈ గంటను అష్టధాతువులతో దావుదయాళ్ నేతృత్వంలోని బృందం వికాస్ మిట్టల్ ఫ్యాక్టరీ లో తయారు అయింది.2,100 కిలోల బరువైన ఈ గంట 6′ X 5′ పొడువు, వెడెల్పుతో తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ గంటను ఒక్కసారి మ్రోగిస్తే.. గంట నుంచి వెలువడే శబ్దం దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక్బాల్ మిస్త్రీ, దావుదయళ్‌బృందంతో పాటు దాదాపు 25 మంది 4 నెలల్లో కష్టపడి తయారు చేశారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ప్రస్తుతం ఈ గంట తరలింపుకి చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube