టీ మీడియా డిసెంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రతిష్టించేలా పోలీస్ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కి వినతిపత్రం అందజేసిన మాదిగ కుల సంఘ పెద్దలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల చిరకాల కోరిక అయిన జాతీయ నాయకుడు భారత ఉప ప్రధానిగా దేశానికి విశిష్ట సేవలందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రతిష్ట చేయుటకు ఎంతోకాలం నుండి అధికారులకు మరియు రాజకీయ నాయకులకు విన్నవించుకోవడం జరిగింది. కానీ పైన తెలిపిన విగ్రహ ప్రతిష్ట ఈ విషయంలో ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు కొందరు వ్యక్తులు స్వార్ధ స్వలాభాల కొరకు వివాదస్పదమైన స్థలంలో మహనీయుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ మాదిగ కుల సంఘం ఇట్టి విషయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజుల కింద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ కి మరియు మున్సిపల్ కమిషనర్ కి మహనీయుని విగ్రహం ప్రతిష్ట గురించి కౌన్సిల్ తీర్మానం చేయించగలరని కోరడమైనది. ప్రధాన కూడలి అయిన వివేకానందుడి విగ్రహం పక్కన గాని లేక మినీ ట్యాంక్ బండ్ నల్లచెరువుపై ఏప్రిల్ 5న మహనీయుని జన్మదినం పురస్కరించుకొని అధికారికంగా ప్రభుత్వం ఖర్చులతో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించగలరని కోరడమైనది. ఈ విషయంలో పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంధం సత్యం, గంధం విజయ్ కుమార్, డి కృష్ణయ్య, డి.జయరాములు, డి .జాన్, డి.బాబురావు, కుమార్, గంధం చెన్నయ్య, డి.దేవదాస్, డి.రవి, గంధం రాములు, సాయిలు, రత్నయ్య, గంధం లక్ష్మయ్య, జి మన్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube