సీడ్ పేరుతో భాడా ఫ్రాడ్

10వేల కోట్లకు పైగా టోకరా

0
TMedia (Telugu News) :

సీడ్ పేరుతో భాడా ఫ్రాడ్..

– 10వేల కోట్లకు పైగా టోకరా

– బిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతి నిధులు ఎజెంట్లు

– మాజీ మంత్రి, చైర్మన్ ల తీరుపైన అనుమానాలు

– భీష్మ వ్యవహారంతో బైటకి

టి మీడియా, డిసెంబర్ 16, ప్రత్యేక ప్రతినిధి : చింత చచ్చినా పులుపు చావలేదు, పులి మరణించిన చారలు అట్లానే ఉన్నాయి. అన్నట్లుగా ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది అక్రమార్కులు వ్యవహారశైలి. ప్రభుత్వం మారినా వారి వక్ర బుద్ది కొనసాగుతోంది. అందుకు నిదర్శనం సీడ్ పేరుతో జరుగుతున్న బడా ఫ్రాడ్. టి మీడియా పరిశీలిలనలో బైటపడింది.. పెద్ద పల్లి జిల్లాలో “భీష్మ “సీడ్స్ పేరుతో టోకరా వేస్తున్న విషయం దృష్టికి వచ్చి పరిశీలన జరపగా మేడ్చల్ కేంద్రంగా బిఆర్ఎస్ నేతగా చలామణి అవుతున్న వ్యక్తి, ఎటువంటి అనుమతులు లేకుండ, పరిశ్రమ అనేది లేకుండా భీష్మ అనే నకిలీ బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. సీడ్ కోసం సాగు అంటూ రైతులకు నకిలీ విత్తనం అంటకడుతున్నారు.. ఈ రకం నకిలీ సీడ్ కంపెనీలు తెలంగాణాలో 9 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు గడిచిన 5 ఇయర్స్ లో 15 వేల కోట్ల రూపాయల వరకు రైతులకు టోకరా వేసినట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారికి ఏజెంట్లుగా స్థానికంగా ఉన్న బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతీ నిధులు అనేది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో బైట పడింది. ఇక్కడి రైతులకు ఈ సీజన్ లో ఒక కంపెనీ సీడ్ సాగు పేరుతో వేసిన టోకరా రూ.100కోట్లు పై మాటగా ఉంది. ఈ మండలం వ్యవసాయ అధికారిని శుక్రవారం టి మీడియా ప్రతినిధి వివరణ కోసం ఫోన్ చెయ్యగా నన్ను ఏం అడగొద్దు, పై వారిని అడగండి అంటూ ఫోన్ పెట్టేసాడు. ఇంతటి అక్రమ వ్యవహారం జరుగుతున్నా అప్పటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్ది, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండభాల కోటేశ్వరరావు ఏం చేశారన్న అనుమానాలు ఉన్నాయి.

Also Read : నాదెండ్ల అరెస్ట్ ను త‌ప్ప‌ప‌ట్టిన ప‌వ‌న్

భీష్మ భాగోతం :
మేడ్చల్ కార్యాలయం అడ్రెస్ గా చెపుతూ..భీష్మ బ్రాండ్ తో వరి, కాటన్ కూరగాయల విత్తనాలు విక్రయం తెలంగాణ లో విక్రయం చేస్తోంది. ఎటువంటి సీడ్ ల్యాబ్, ఇతర కనీస సౌకర్యం లు కూడా లేకుండ ఉన్నట్లుగా తన వెబ్ సైట్ లో చూపుతోంది.. ఈ వెబ్ సైట్ హైద్రాబాద్ కు చెందిన డిజిటల్ వెబ్ మీడియా (9700598922)రు 20 వేలతో తయారు చేసి ఇచ్చానని తెలిపారు. వెబ్ నిర్వహణ, మార్పులు అధికారం వెబ్ డిజెయినర్ దగ్గరే ఉంది.వెబ్ సైట్ లో సమాచారంతో తమకు సంబంధం లేదని, వారు చేసేది అగ్రి మార్కెటింగ్ అని, ఎటువంటి విత్తనాలు తయారి పరిశ్రమ లేదు అన్నది తెలుసని టి మీడియా కి తెలిపారు.

టోకరా ఇలా :
పెద్దపల్లి జిల్లాలో నాలుగు ఏళ్ళుగా భీస్మా వరి సీడ్ సాగు పేరుతొ రైతులకు విత్తనాలు సంచులు ఇవ్వడం ఉత్పత్తి వచ్చిన తరువాత కొంతమందివి మాత్రం కొనడం చేస్తున్నారు. వీరు రైతులకు సీడ్ పేరుతో ఇచ్చే సంచులపై ఎక్కడా వివరాలు ఉండవు. రైతులతో ఒప్పంద పత్రాలు ఉండవు. కొన్న ఉత్పత్తి కి బిల్లులు ఉండవు. ప్రభుత్వం కు, స్థానిక మార్కెటింగ్ శాఖ కు పన్ను చెల్లింపులు ఉండవు. కోట్ల రూపాయలు లావాదేవి లు జరుగుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారం అంత నడపటం కోసం ఆర్గనైజర్ల పేరుతో స్థానిక బిఆర్ఎస్ నేతలను, ప్రజాప్రతీ నిధులను నియమించారు. తన దాన్యం ఎందుకు కొనరు అని అడిగి నందుకు అక్కడి సబ్ ఆర్గనైజర్ శుక్రవారం ముత్తారం కు చెందిన రైతుకు ఫోన్ చేసి మా యాజమాని పాడి కౌశిక్ రెడ్దికి, ఎర్రబెల్లి దయాకర్ కి ముఖ్య అనుచరులు ఈ మండలం వరకు వ్యాపార లావాదేవిలు చేసేది వైస్ ఎంపిపి (బిఆర్ఎస్ )ఆయన దగ్గర రికి రేపు వస్తా, నీపై బెదిరింపులు కేసు పెడతా అన్న ఆడియో టి మీడియా వద్ద ఉంది. వాస్తవంగా ఆ రైతు టి మీడియా సూచనల మేరకు ఫోన్ చేశారు.

Also Read : గవర్నర్‌ ప్రసంగం చూస్తే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చదివినట్లు ఉంది

నకిలీ సీడ్ లు :
ఒర్జినల్ సీడ్ కంపెనీ డిల్లీ కి బిష్మ సీడ్స్ వీరికి అన్ని అనుమతులు ఉన్నాయి.. నకిలీది భీష్మ ఈ ముఠా మేడ్చల్ అడ్రెస్ తో అక్షరం మార్చి అసలు కంపెనీ పేరుతో అక్రమ వ్యవహారం నడుస్తోంతోంది. ఒర్జినల్ కంపెని తెలంగాణ లో వ్యాపారం లేదు. అది అసరా చేసికొని అక్రమానికి తేర లేపారు. రైతులు వద్ద నుండీ సేకరించిన ఉత్పత్తుల లో కెమికల్ కలిపి అందమైన ప్యాకింగ్ లు చేసి అమ్ముతున్నారు. (మరికొన్ని వివరాలు మరో కదనం లో.. )

భీష్మ యూట్యూబ్ లో రైతు అభిప్రాయం :
చెత్త సీడ్ పోయిన సంవత్సరం నేను వేసాను.. వెయిట్ చాలా తక్కువ వస్తుంది.. మాతో పాటు మా పక్కన చేను వాళ్ళు కూడా వేసారు.. దిగుబడి రాలేదు.. చెత్త అంటే చెత్త సీడ్ ఏమి బాగుండదు.. బరువు బాగా తక్కవగా ఉన్నాయి అని సొసైటీ వారు వడ్లని జాలీ పోయించరు.. అలా జలి పోసిన కూడా ఫుల్ బ్యాగ్ నిండింది అసలు 42 కేజీ ల బ్యాగ్ నిండుతదో నిండదో అనుకున్న అంతా బరువు తక్కువ ఉన్నవి.. ఎవరైనా వెయ్యాలి అనుకున్న వారు ఒక బ్యాగ్ వేసి చూడండి అంతే… ఎందుకంటే వితనాలకి మహా అంటే ఒక బ్యాగ్ కి 750 నుండి 1000 లోపు ఖర్చు అవుతుంది కానీ ట్రాక్టర్ కి మాత్రం వేళలో కర్చు అవుతుంది భూమిని కేజ్ వీల్ కొట్టేదక..కాబట్టి ఇలాంటి విత్తనాలు పెట్టడం ద్వారా దిగుబడి తక్కువ వచ్చి పెట్టుబడులు మీద పడుతాయి.. ఇక్కడ డబ్బును వెస్ట్ అవుతున్నవి అలాగే పని వెస్ట్ అవుతుంది..

Also Read : ప్రముఖ యూట్యూబర్‌ ‘పీకే’ చందు సాయి అరెస్ట్‌!

కాబట్టి విత్తనం కొనే ముందు మంచిగా ఆలోచించి భూమికి తగ్గట్టుగా, వాటర్ కి తగ్గట్టుగా విత్తనం కొనండి.. ఎందుకంటే బోరు తక్కువగా పొస్తే తక్కువ రోజులలో కోతకు వచ్చే విత్తనం వేయండి.. అలాగే భూమిలో ఎక్కువ సారం దమ్ము లేకపోతే ఒక పోస వరి విత్తనాలు వేయకండి.. ఎందుకంటే దిగుబడి లో తేడా ఏమీ ఉండదు అన్ని వరి పంటల మాదిరిగానే వస్తుంది. కానీ భూమిలో సారం ఉంటే ఒక్క పోసా విత్తనం అంతా దిగుబడి ఏ ఇవ్వదు..మంచి యాజమాన్య పద్దతులు పాటిస్తే..మళ్ళీ చెపుతున్న విత్తనం కోనే ముందు మంచి విత్తనం కొని వేయండి. పంట పెట్టుబడులు మొత్తం 20% విత్తన ఎంపిక 40% యాజమాన్య పద్ధతుల పై 60% భూమిసారం పై ఆధారపడుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube