“బ(ధ)నం” బ్యాంక్

-యాప్ తరహాలో ఫైనాన్స్

1
TMedia (Telugu News) :

 

minits
minits

“బ(ధ)నం” బ్యాంక్

-వారం వస్తే రచ్చ

-చట్ట విరుద్ధంగా
కార్యకలాపాలు
-యాప్ తరహాలో ఫైనాన్స్

– బ్రోకర్లు గాప్రజాప్రతినిధులు

టి మీడియా, మార్చి10,ప్రత్యేక ప్రతినిధి:

రిజర్వు బ్యాంకు అనుమతి ఉంది,మహిళ సాధికారికత లక్ష్యం,లాభాపేక్ష కాకుండా స్వచ్ఛంద సేవ అంటూ పేర్కొంటూ ఫోజు ఇస్తున్న అనుమతుల్లేని బ్యాంక్ పేదలను పీల్చి,పిప్పి చేసే కార్యక్రమం కు తెర”లేపింది. “బ(ధ)నం ” బ్యాంక్ గా పేరుగాంచిన ఈ సంస్థ నిర్వహణ చట్ట విరుద్ధ మైంది గా తెలుస్తోంది.నిషేధిత యాప్ ల తరహాలో అప్పులు ఇస్తూ వారం వస్తే అప్పు తీసుకొన్న వారిలో గుబులు పుట్టే విధంగా చేస్తోంది. వీరి అక్రమ ఫైనాన్స్ వ్యాపారం కొంతమంది ప్రజాప్రతినిధులు ను బ్రోకర్లు గా మార్చారు. టి మీడియా పరిశీలన లో అనేక అక్రమాలు వెల్లడి అయ్యాయి.

బెంగాల్ ప్రధాన కేంద్రం గా ఈ “బధనాం” కార్యక్రమం నడుస్తోంది.స్వచ్ఛంద సేవ అని బైల లో పేర్కొన్నారు.రెండు తెలుగురాష్ట్రాల లో హైదరాబాద్, విజయ వాడ లో మాత్రమే కార్యాలయం లు ఉన్నాయి అని తమ వేబ్సైట్ లో చూపారు.అంటే అక్కడ మాత్రమే కార్యకలాపాలు జరపాలి.అందుకు విరుద్ధంగా రెండు తెలుగు రాష్ట్రాల లో విస్తృతంగా అనధికారికంగా బ్రాంచిలుప్రాంభించారు.బోర్డులు పెట్టారు. రికార్డుల్లో మాత్రం అవుట్ లెట్స్( అవుట్ సోర్సింగ్ పద్దతి లో ఏజెంట్లు ను నియమించడం).అని పేర్కొన్నారు.అవుట్ లెట్ పెట్టాలి అంటే ముఖ్యంగా ఆర్ధిక కార్యకలాపాలు అయితే రిజర్వు బ్యాంకు అనుమతి పత్రాలు తో స్థానిక ఆర్డీవో,పోలీస్ అనుమతి ఉండాలి.అవి ఏమి లేవు. అయిన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

వారం,వారం కలెక్షన్ లు

ఈ సంస్థ బైలా లో ఎక్కడ వారం,వారం,కలెక్షన్స్ అనేది లేదు.పాన్ కార్డు ఉండాలి.లక్ష నుండి ఆపైన మాత్రమే అప్పు ఇస్తారు.అన్ని పరిశీలించి 4 రోజుల్లో రుణం మంజూరు ఇస్తారు.. అందుకు విరుద్ధంగా ఒక్కొక్కరికి 30 వేలు మంజూరు అని,అదికూడా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని,వెలిముద్ర ఆన్లైన్ లో వేయించుకుని 28 వేలు చేతికి.ఇస్తున్నారు.ప్రతి వారం ఒక్కరి నుండి 700లు 50 నెలలు ఇంటికి వెళ్లి బ్రోకర్లు ద్వారా వసూలు చేస్తున్న రు.ఇవ్వరి వారి ఇంటి ముందు రచ్చ చేస్తున్న రు.

payments book
payments book

బోగస్ గ్రూప్ లు
ఈ సంస్థ చట్ట విరుద్ధ కార్యకలాపాలు కోసం గ్రామాల్లో డ్వాక్రా తరహాలో బోగస్ గ్రూప్ లు క్రియేట్ చేస్తున్నారు..ఈ గ్రూప్ సమావేశాలు జరగక పోయిన జరిగినట్లు కూడా కూడా సృష్టించిన రికార్డులు టీ మీడియా చేతికి చిక్కాయి. వీరు చెప్పే మినిట్స్ వారం,వారం కట్టిన డబ్బులు రాసే ఖాతా పుస్తకం కావడం గమనార్హం

తేదీ లేని సమావేశం
మహిభూబాద్ జిల్లా డోర్నకల్ లోని అనధికార బ్రాంచి పరిధిలో 15 మంది ఖమ్మం జిల్లా రఘునాధపలేం మండలం కు.చెందినవారి కి రుణాలు ఇచ్చారు. వారిలో 4 గురికి కలిపి కలెక్షన్స్, మినిట్స్ ఓకే పుస్తకం ఒకటి ఇచ్చారు. వ్యాపారం,టైలరింగ్ ,ఇతరత్రా వృత్తులు కోసం రుణం ఇచ్చినట్లు,ప్రతి వారం ఆ 4 గురు సమావేశం అయిన్నట్లు రాసారు.గ్రూప్ సభ్యులు పేర్లు తెలుగులో పుస్తకం లో ఉండగా,సమావేశం తీర్మానాలు మాత్రం అర్థం కాని ఇంగ్లీష్ లో ఉండడం వీరి బోగస్ వ్యవహారం కు నిదర్శనం గా ఉంది.అన్ని చోట్లా ఇదే బోగస్ వ్యవహారం ఉంది.వాస్త వంగా ఆ గ్రూప్ సభ్యులు అంత రోజు కూలీలు.ఎవరూ వృత్తి దారులు కారు. 4 రోజులు పని మానేసి డోర్నకల్ చుట్టూ తిరిగారు.ప్రస్తుతం వారానికి 700లు కడుతున్నారు.పుస్తకం పై మాత్రం కలెక్షన్స్ ఏజంట్లు 685 రూపాయలు రాసి 15 రూపాయలు కాజేస్తూ న్నారు.

చెల్లింపు లకు అడరల్లేవు

అప్పుతీసుకున్న వారు వారం, వారం చెల్లిస్తున్న మొత్తానికి ఎటువంటి అధికారిక రసీదు లు ఇవ్వడం లేదు. ఏజెంట్లు కాజేసిన ఎవరు ఏమి చెయ్యలేని పరిస్థితి ఉంది.

అధికారిక అండ

ఈ బోగస్ వ్యవాహారం లకు అధికారిక అండ ఉన్నట్లు తెలుస్తోంది.బారి మొత్తలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సాధికారిక ముసుగులో

మహికా సాధికారిక ముసుగు అనేది తేలింది. ఖమ్మం నగరం లాంటి చోట కొంతమంది దివ్యంగులకు ఆర్థిక,ఇతర సహయాలు చేసి.భారీగా అక్రమ వడ్డీ వ్యాపార విస్తరణ చేస్తున్నారు..మహిళ ల గురించి గొప్పలు చెప్పే ఈ బ్యాంక్ వారు అంతర్జాతీయ మహిళ దినోత్సవం గురించి అసలు పట్టించు కోలేదు.వీరి స్వచ్ఛంద సేవ వెనుక భారీ మోసం ఉంది అనేది తేలింది. బంధాలు ను సైతం తెంపుతున్న ఈ బ్యాంక్ వ్యవాహారం ల పై పూర్తి స్థాయి విచారణ అధికారికంగా చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తా యి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube