భద్రాచలం పట్టణంలో మరియు పరిసర ప్రాంతములలో కరోనా ఉద్ధృతి దేవాలయములలో భక్తులకు దర్శనములు నిలిపివేయబడినవి

ఇందుమూలముగా సమస్త భక్తజనులకు తెలియపరచునది ఏమనగా భద్రాచలం పట్టణంలో మరియు పరిసర ప్రాంతములలో కరోనా ఉద్ధృతి విస్తృతంగా ఉన్నందువలన మరియు వేగంగా వ్యాప్తి చెందుచున్నందున దేవాలయమునకు విచ్చేయు భక్తులకు కూడా కరోన సంక్రమించకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాచలం పట్టణంలో దేవాదాయ శాఖ ఆధీనంలో గల ఈ క్రింద పేర్కొనబడిన గ్రూప్ దేవాలయములలో అనగా
1) శ్రీ అభయ ఆంజనేయ స్వామి
వారి దేవాలయం (బ్రిడ్జి రోడ్డు)
2) శ్రీ కనక దుర్గ అమ్మ వారి
దేవాలయం (ఆర్టీసీ గేటు వద్ద)
3) శ్రీ కుసుమహరనాథ్ బాబావారి
దేవాలయం (రంగనాయకులగుట్ట)

తేదీ 09-08-2020 ఆదివారం నుండి
తేదీ 19-08-2020 బుధవారం వరకు
దేవాలయములలో
భక్తులకు దర్శనములు నిలిపివేయబడినవి.

దేవాదాయ శాఖ ఆధీనంలో గల గ్రూప్ దేవాలయాలు అన్నింటిలో రేపటి నుండి అనగా
తేదీ 09-08-2020 ఆదివారం నుండి
తేదీ 19-08-2020 బుధవారం వరకు
ప్రతిరోజు దేవాలయములలో
ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా
యధావిధిగా

నిత్య కైంకర్యాలను ( అభిషేకము, అలంకరణ, అర్చన, హారతి కార్యక్రమాలు) పఅర్చకుల వారిచే ఏకాంతంగా, ఆంతరంగికంగా నిర్వహించడం జరుగుతుంది.

#”కోవిడ్-19″(కరోనా) కారణంగా
ఇట్టి కార్యక్రమాల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనుటకు అవకాశం లేదు#
దేవాలయములలో భక్తులకు దర్శనములు నిలిపివేయబడినవి
కావున భక్తులు పై విషయమును గమనించి సహకరించవలసిందిగా
కోరుచున్నాము.

        ఇట్లు:

జి వేణుగోపాల్ గుప్తా కార్యనిర్వాహణాధికారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, గ్రూపు దేవాలయములు, భద్రాచలం