ఖమ్మం : సురభి నాటకోత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం రాత్రి ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాన్ని ప్రారంభించారు..
కళాకారులు తమ పాత్రలకు జీవం పోశారు నాటకంలోని బాలనాగమ్మ పాత్రను వెంగమాంబ,చంద్రనాగమ్మ గా రాజేశ్వరి,సూర్య నాగమ్మగా రజిని,పగడాల నాగమ్మ గా మాధవీలత,దక్షణనాగమ్మ గా కృష్ణవేణి,ఉత్తర నాగమ్మ గా గుణవతి,గోల నాగమ్మగా అరుణ,మాయలపకీర్ గా సత్యనారాయణ,జంగమదేవర గా గడదాసు రవీందర్ లు పాత్ర పోషించారు బాలనాగమ్మ జానపద నాటకం నవరసలు కలిగిప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమంలో రామదాసు కృష్ణమూర్తి,కళాపోషకులు,కళాభిమాని,ఆకుల గణపతి,రిటైర్డ్ తాసిల్దార్,రామ్ శెట్టి రాజారావు రిటైర్డ్ లేబర్ ఆఫీసర్,పాలకుర్తి కృష్ణ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిష్ణ,తదితరులు పాల్గొన్నారు.