భద్రాద్రి బాధితులకు “శ్రీ బాలాజీ” వితరణ

600 కిట్లను తయారు చేసిన "శ్రీ బాలాజీ" యాజమాన్యం

1
TMedia (Telugu News) :

భద్రాద్రి బాధితులకు “శ్రీ బాలాజీ” వితరణ
– నిత్యావసరాలు, వస్త్రాల పంపిణీకి సర్వం సిద్ధం
– 600 కిట్లను తయారు చేసిన “శ్రీ బాలాజీ” యాజమాన్యం
టి మీడియా,జూలై30, ఖమ్మం సిటీ : శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి గారు మరో సారి తన ఓదార్యతను చాటుకుంటున్నారు. ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలమైన భద్రాద్రి బాధితులకు తన వంతు సాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. నిత్యావసరాలు, వస్త్రాలను అందించేందుకు నడుం బిగించారు. భారీ వరదల కారణంగా గోదావరి నది ఉగ్రరూపానికి భద్రాచలం పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఇళ్ళు వదిలి కట్టుబట్టలతో బయటికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా వరదలు తగ్గినప్పటికీ అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మాత్రం ఇప్పటికీ మెరుగుపడలేదు. దీంతో అక్కడి వరద బాధిత ప్రజల అవస్థలను తీర్చేందుకు తనవంతు సాయాన్ని అందించేందుకు “శ్రీ బాలాజీ ఎస్టేట్స్” అధినేత వత్సవాయి రవి గారు శ్రీకారం చుట్టారు.

 

Also Read : సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న టి ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

 

ఈ మేరకు 10 కేజీల బియ్యం, 16 రకాల ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన 600 కిట్లను తయారు చేసి భద్రాద్రికి తరలించేందుకు సిద్ధం చేశారు. అలాగే వస్త్రాలను సైతం భారీగా సేకరించి భద్రాచలానికి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలికిన “శ్రీ బాలాజీ ఎస్టేట్స్” అధినేత ఉత్సవాయి రవి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో అన్నం ఫౌండేషన్ కు 5 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులను అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇక అనారోగ్యంతో బాధపడే చిన్నారుల వ్యధను తీర్చేందుకు ఆయన అనేక పర్యాయాలు ఆర్థిక సాయాన్ని అందించి ఆయా కుటుంబాల్లో పెద్దన్న పాత్రను పోషించారు. తాజాగా సేకరించిన వస్త్రాలను, తయారు చేసిన నిత్యావసర వస్తువుల కిట్లను శనివారం ఒక వాహనంలో భద్రాచలానికి తరలించనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube