నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

0
TMedia (Telugu News) :

నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

టీ మీడియా, ఫిబ్రవరి 6, హైదరాబాద్‌ : ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ ఏమి మాట్లాడిన కాంట్రవర్సీ అయ్యిపోతుంది. ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో దేవబ్రాహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడాడని, ఆ తరువాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా వ్యాఖ్యానించాడు అంటూ బాలకృష్ణ చుట్టూ వివాదాలు రాచుకున్నాయి. తాజాగా నర్సుల పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు.మరోసారి వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్!పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య, తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. బాలకృష్ణ వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోని, నర్సులకు బహిరంగా క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు. దీని పై నేడు బాలకృష్ణ స్పందిస్తూ నర్సులకు బహిరంగ లేఖతో క్షమాపణలు తెలియజేశాడునర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.

Also Read : పచ్చి పాలతో ఇన్ని ప్రయోజనాలా..

రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అంటూ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాడు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. దేవబ్రాహ్మణల వివాదంలో కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన బాలయ్య.. అక్కినేని వివాదంలో మాత్రం తాను క్షమాపణ చెప్పను అంటూ కుండ బద్దలు కొట్టేశాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube