పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు

పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు

1
TMedia (Telugu News) :

పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు
టీ మీడియా , ఏప్రిల్ 11,విజయవాడ: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు బాలినేనిని కలిసి రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ చిన వెంకట రెడ్డి, బాలినేనిని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బాలినేని అనుచరులు పార్టీ పదవులకూ రాజీనామా చేస్తున్నారు.

Also Read : ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుళ్లు..

ఈ సందర్భంగా బాలినేని అనుచరుడు, ఎంపీపీ చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ బాలినేనికి అన్యాయం జరిగిందన్నారు. ఆయన రాజీనామా సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తానే కాదు.. చాలా మంది రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారని, రాజీనామాల పరంపర కొనసాగుతోందని చిన వెంకటరెడ్డి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube