బండి సంజయ్‌ అరెస్ట్‌

బండి సంజయ్‌ అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

బండి సంజయ్‌ అరెస్ట్‌

టి మీడియా,ఆగస్ట్ 23, జనగామ: కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం-పోలీసుల దాడి నేపథ్యంతో ఆయన దీక్షకు ఉపక్రమించగా.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఇక పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం.

 

Also Read : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఇక దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా, ఆ భద్రతను తిరస్కరించారు బండి సంజయ్.‘నా భద్రత సంగతి కార్యకర్తలే చూసుకుంటారు’ అని ఆయన పోలీసులతో తేల్చి చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏదైనా జరిగితే సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించిన బండి సంజయ్‌.. పాదయాత్ర శిబిరం వద్ద ‘‘కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్ష’’కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు.. ఆయన భద్రతా కారణాల దృష్ట్యే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube