కేసీఆర్, కేటీఆర్ టూర్లపై బండి ఫైర్

అధిక పన్నులు ఘనత వారిదే

1
TMedia (Telugu News) :

కేసీఆర్, కేటీఆర్ టూర్లపై బండి ఫైర్..

-అధిక పన్నులు ఘనత వారిదే

టి మీడియా, మే 23,కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ ముందు ముఖం చెల్లక కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని, డబ్బు దాచుకునేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్లారని దుయ్యబట్టారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…….
రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే సీఎం మాత్రం దేశమంతా తిరుగుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు లబ్ధి పొందిందన్నారు.
తక్కువ రేటు లభిస్తుండడంతో ఆర్టీసీ ఇంధనాన్ని ఇతర రాష్ట్రాల్లో కొంటున్నదన్నారు. రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారికి సాయం చేస్తే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడాలో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున అప్పుల భారం వేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని మండిపడ్డారు.

 

Also Read : ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

 

బీజేపీ ఎదుగుదలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ లోకి వెళ్లాడన్నారు. సీఎంఓలోలా కాసులకు కక్కుర్తి పడే అధికారులు పీఎంఓలో లేరన్నారు.జిమ్మిక్కులు చేస్తూ ఒక నెల పెన్షన్ డబ్బులను ఎగ్గొట్టారన్నారు. తక్కువ ధరకు అమ్ముకున్న, వద్దంటే వరి వేయని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో చాలినంత సిబ్బంది లేరని వసతులు కూడా లేవని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 6 నుంచి 10 కిలోల తరుగు పేరిట ధాన్యాన్ని ఎక్కువ తూకం వేస్తున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి బయటకు రావడమే సంచలనమన్నారు. ఏడు సంవత్సరాలు రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నానని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాడని ఇప్పుడేమో కేంద్రం కొనడం లేదని అంటుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube