బంకర్‌లో భయంగా …

సైరన్‌ మోగితే  - బంకర్‌లోకి పరుగు

0
TMedia (Telugu News) :

బంకర్‌లో భయం భయంగా ..

తల్లిదండ్రులతో కుందన్‌ చౌదరి
తల్లిదండ్రులతో కుందన్‌ చౌదరి

సైరన్‌ మోగితే  – బంకర్‌లోకి పరుగు

ఇండియాకి వచ్చాక బతికామని అనుకున్నా 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లసుజాతనగర్‌కు చెందిన చిగురుపాటి చంద్రశేఖర్‌, జ్యోతిల కుమారుడు కుందన్‌ చౌదరి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ 3వ సంవత్సరం చదివేందుకు మూడు నెలల క్రితం వెళ్లాడు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపధ్యంలో ఇండియన్‌ ఎంబసీ చొరవతో బుధవారం క్షేమంగా ఇంటికి చేరుకున్న అతడు తన అనుభవాలను  వివరించాడు. యుద్దం ప్రారంభానికి ముందే ఇతర దేశాల విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లారని, కానీ ఉక్రెయిన్‌లో యుద్దం వస్తుందని ఇండియన్‌ ఎంబీసీవారు ముందుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చెయ్యలేదని తెలిపాడు. అందువల్లనే విద్యార్థులంతా ఇక్కడే ఉండి పోయారన్నాడు. ఫిబ్రవరి 24న కీవ్‌ నగరానికి చేరువలో రష్యా బాంబులు వేసిందని, ఆనాటి నుంచి విద్యార్థులందరినీ బంకర్‌లోకి వెళ్లాలని అక్కడి అధికారులు తెలిపారన్నాడు. అప్పటినుంచి సైరన్‌ మోగినప్పుడల్లా బంకర్‌లోకి పరుగెత్తేవారమన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ తమపై బాంబు పడుతుందోనని భయం భయంగా గడపామన్నాడు. తనతో సహా  ఏడుగురు విద్యార్థులు  కీవ్‌ నుంచి రైల్వేస్టేషన్‌ రాగానే దాని దగ్గరలో బాంబు పడడంతో రైలు మిస్సయిందని, దాంతో వెంటనే క్యాబ్‌ తీసుకుని విన్సీత్‌ నగరానికి చేరుకున్నామన్నాడు.

 

 

 

    also read :బడ్డీకొట్టు తొలగింపుకు రంగం సిద్ధం

అక్కడే రెండు రోజులు బస చేశామన్నాడు. అక్కడ ఎలాంటి అలజడి లేకున్నా ఆహారానికి బాగా ఇబ్బంది పడ్డామన్నాడు.  కన్సెల్టెన్సీ వారికి ఫోన్‌ చేస్తే అంతా తాము చూసుకుంటామని ఇండియన్‌ ఎంబసీకి తెలిపారన్నాడు. తరువాత కన్సెల్టెన్సీ వారు తమను రుమేనియా బోర్డర్‌కి తరలించేందుకు 420 కి.మీ. ప్రయాణానికి బస్సులను ఏర్పాటు చేశారని, మొత్తం 20 బస్సులలో అందరం వెళ్లగా బోర్డర్‌కి 10కి.మీ ముందే దింపేశారన్నాడు. అక్కడి  నుంచి 10కి.మీ రుమేనియా సరిహద్దు వరకు 20కేజీల లగేజీతో నడుచుకుంటూ వెళ్లామని తెలిపాడు. కష్టపడి అక్కడకు చేరేకున్నా ఆ రోజు బోర్డర్‌ దాటలేకపోయామన్నాడు. ఎందుకంటే తమకంటే ముందుగా ఇక్కడికి చేరుకున్నవారు అనుమతి లేకుండా బోర్డర్‌ దాటుతుండగా రుమేనియావారు రబ్బరు బుల్లెట్లతో ఫైరింగ్‌ చేసి వారిని ఆపారని తెలిసింది.

 

 

 

 

   also read :ఐదుపంచాయతీలపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

దాంతో అక్కడే నిద్రించామన్నాడు. తెల్లవారిన తరువాత ఇండియన్‌ ఎంబసీవారు అందరినీ పిలిపించి బోర్డర్‌ దాటించారని తెలిపాడు. రుమేనియాకు చేరుకోగానే ఇండియన్‌ ఎంబీసీవారు తమకు ఫ్రీగా అన్ని సౌకర్యాలు కల్పించారన్నాడు. అక్కడినుంచి కొందరిని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లగా తాము అక్కడ పరిచయమున్న రుమేనియావాసి కారులో విమానాశ్రమానికి చేరుకున్నామన్నాడు. అక్కడి నుంచి ఫైట్‌ టికెట్‌ తీసుకుని ఢిల్లీకి చేరుకుని, అక్కడ తెలంగాణ భవన్‌కు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకున్నామన్నాడు.మాతో బయలుదేరిన చాలామంది ఇంకా అక్కడే ఉన్నారని తెలిసిందన్నాడు. తాము ఇండియాలో కాలు మోపినతరువాతే బతికామని ఊపిరిపీల్చుకున్నామని వివరించాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube