బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం

బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం

1
TMedia (Telugu News) :

బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం

టీ మీడియా, మీ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందిన అడ్వకేట్ భరత్ కుమార్ కి వారి చిన్ననాటి మిత్రులు పదవ తరగతి బ్యాచ్ కు చెందిన మిత్రులు స్థానిక రావూస్ కాలేజీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిత్రులందరూ మాట్లాడుతూ భరత్ కుమార్ చిన్ననాటి నుండి సైలెంట్గా పద్ధతిగా ఉంటూ వారి తండ్రి, అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై కావడం మా అందరికీ గర్వకారణం వారి ఇంకా పై స్థాయికి ఎదగాలని 84 /85 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన మిత్రులు కోరారు.

Also Read : మంత్రి సత్యవతి కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

ఈ సన్మాన కార్యక్రమం మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, రావుస్ కాలేజ్ అధినేత కొండ శీను, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనూరు యాదగిరి, టీచర్ రవీందర్ రెడ్డి, బండారు రవి, న్యాయవాది శీను, నాగవరం వెంకటేష్, గంధం రమేష్, బాలస్వామి, కిట్టు, సత్యనారాయణ గౌడ్, నందిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube