పరుచూరి బరి తెగింపు

-గోదాం కు నివాసం అంటూ అనుమతులు

0
TMedia (Telugu News) :

 

RESIDENSE

పరుచూరి బరి తెగింపు

-గోదాం కు నివాసం అంటూ అనుమతులు

-కుమ్మక్కుయిన మున్సిపల్, విద్యుత్ శాఖలు

-లక్షల రూపాయల ఎగవేత

టీ మీడియా, జనవరి 24, ప్రత్యేక ప్రతినిధి:
ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో సిఎం కెసిఆర్ ఆదేశాలు తో,మంత్రి కేటీఆర్ సహకారం తో మంత్రి పువ్వాడ అజయకుమార్చేస్తున్నారు.మరో వైపు మున్సిపాలిటీ కేంద్రం గా ఉన్న అక్రమార్కులు కొంతమంది మున్సిపల్, ప్రభుత్వ ఆదాయానికి నెలకు లక్షల్లో గండి పెడుతూ బొక్కుతున్నారు.అటువంటి బరి తెగింపు నగర శివర్ల లోని ప్రకాష్ నగర్ చివరస్తా లో ఉన్న పరుచూరి పేరుతో ఉన్న 11 గౌడాన్ లు కనిపించింది..
టి మీడియా పరిశీలనలో బారి అక్రమము బైట పడింది. గోదాంలకు నివాసం అంటూ రికార్డుల్లో పేర్కొని అనుమతి ఇవ్వడంతో పాటు.క్షేత్ర స్థాయిలో మున్సిపల్ ఇంటి నెంబర్ ఉన్న నిర్మాణము స్థానం లో అసలుది కాకుండామరో ఫోటో పెట్టారు. ఈ ఫోటో తీసేది మున్సిపల్ సిబ్బంది.ఆన్లైన్ రికార్డుల్లో ఉంచేది మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షణ లో మాత్రమే జరుగుతుంది.ఒక్క పరుచూరి విషయ ము లో కోటి రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.తిలా పాపం తల పిడికెడు లాగా విద్యుత్ అధికారు లు చెయ్యి వేశారు.. వివారాలు లోకి వెళితే..

 

MUNSIPAL RECORD
MUNSIPAL RECORD

ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ లో పరుచూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పరుచూరి గోదాం లు పేరుతో 11 (కనిపిస్తున్నవి)చోట్ల నిర్మాణము చేశారు.తండ్రి గంగయ్య గా మున్సిపల్ రికార్డుల్లో పేరున్న ఇతను ప్రతి గోదాం కు పరుచూరి గోదాం అని బైటకు కనిపించే విధంగా రాసారు..వీటి లో కొన్నింటికి అసలు ఇంటి నెంబర్లు కనిపోయించడం లేదు.రెండు గోదాం లు కలిపి బైట కనిపించే బోర్డు కు విరుద్ధ ముగా ఏకంగా పరిశ్రమ పెట్టారు.ఆ పరిశ్రమ ఏర్పాటు కు ఉన్న అనుమతులు తెలియాలి. మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడ వేకటేశ్వరావు ఆధార్ నెంబర్ లేదు అక్కడే అసలుఅక్రమము స్థాయి తెలియ చేస్తోంది.గోదాం నిర్వహణ చెయ్యాలి అంటే పోలీస్,ఫైర్, క్రొత్త గా వచ్చిన నిబంధనలు ప్రకారం జిఎస్టీ, సరుకు భీమా వీటి అన్నింటి తో పాటు మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి.వీటిలో ఏ ఒక్కటి ఆ గౌదాం లకు లేవు అసలు ఫైర్ సేఫ్టీ అనేది లేదు.అయిన విద్యుత్ శాఖ కూడా కనెక్షన్ ఇచ్చారు.. ఈ నిర్మాణం లలో అక్రమ వ్యాపారాలు బైట కు వచ్చాయి.అయిన అధికారులు ఎవరు అటు వైపు చూడరు.వస్త్రాలు కు బ్రాండ్ నకిలీ స్టిక్కర్లు కూడా ఈ గోదాం లలోనే వేస్తున్నారు.

 

 

 

 

 

మున్సిపల్ అక్రమము ఇలా..

మొత్తం 11 నెంబర్లు లో ..10 వ నెంబర్ ప్రకాష్ నగర్ చివరస్తా లో ఉంది. ఈ నిర్మాణం కు సమంధించి మున్సిపల్ రికార్డు ల్లో అసెస్ మెంట్ నెంబర్ “110601783” నివాస గృహముగా పేర్కొన్నారు.344/2ఇంటి నెంబర్ అలాట్ చేశారు. గోడ పై ఉన్న ఈ ఇంటి నెంబర్ గోదాం కి ఉంది..సమీపంలో కూడా లేని 343/1 ఎవరి కో చెందిన నివాస భవనం ఫోటో మున్సిపల్ రికార్డుల్లో పెట్టారు. 2013 లో 7 స్కెయిర్ మీటర్ల లో నిర్మాణము చేసి నట్లు రికార్డు ల్లోపేర్కొన్నారు. వాస్తవంగా 200 ల స్కెయిర్ మీటర్లు ఉంటుంది.బరి తెగించిన ఆశ్రమానికి ఇది పరాకాష్ట అనేది స్పష్టం అవుతోంది. ఇతనికి చెందిన మిగిలినవి ఇదే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఖమ్మం మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అక్రమలకు ఇది ఒక మచ్చుతునక అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..( అక్రమ కరెంట్ కనెక్షన్లు, మున్సిపల్ అక్రమాల గురించి పరుచూరి బరి తెగింపు ఎపిసోడ్ 2 లో తెలుసు కందాము)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube