ఈ-శ్రమ కార్డుకి దరఖాస్తు చేసుకోండి -బర్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ నరసింహమూర్తి

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 16 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బర్లగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్,ఆదివాసి నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొర్శా నరసింహమూర్తి ఈ-శ్రమ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. గురువారం మండల పరిధిలోని బర్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో వర్షశ్రీ కమ్యూనికేషన్స్(మీసేవ) కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చిట్యాల రోజా, చక్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు.ఈపథకంలో అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపుకార్డు(యూనివర్సల్ అకౌంట్ నెంబర్)చేయబడుతుందని, ప్రతి ఒక్కరికి రెండు లక్షల ప్రమాద భీమాతో పాటు ఒక లక్ష రూపాయల అంగవైకల్యం భీమాను పొందాలని తెలిపారు.

అలాగే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, కావున 16 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు వారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈనెల 30 వరకే చివరి తేదీ ఉన్నందున ప్రజలు అందరు గమనించి, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్శశ్రీ కమ్యూనికేషన్స్(మీసేవ) నిర్వాహకులు చిట్యాల రోజా, చక్రీ, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube