బార్లు “ల” నడుస్తున్న బెల్ట్ షాపులు

అల్లిపురం రోడ్డు సమీపం లోని బెల్ట్ షాప్

ఖమ్మం:కేంద్రం ఆదేశాలు కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాప్తి నిరోధం లో భాగంగా బార్ల నుతెరవలేదు*

బార్లు స్థాయిలో కొంతమంది ముందు కిరణం షాప్/హోటల్ / పాన్ షాప్ లు వెనుక బెల్టు షాప్ లు నడుపుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎమ్ఆర్పి కంటే *50 నుండి 80 రూపాయల వరకు అధిక రేట్లకు విక్రయం చేస్తున్నారు.మరి కొంతమంది మూత వేసిన “పర్మిట్ రూమ్”లు అనుకోని పల్లిలు, చిల్లీలు షాప్ లు ఏర్పాటు చేసి ఫీజ్ లు తీసుకొని సిట్టింగుల కు అనుమతిస్తున్నారు.మరికొంతమంది ముందు వైపు హోటల్ బోర్డు పెట్టి వెనుక బార్ల ను మై మరిపించే రీతిలో సిట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.వీటిలో కొన్ని స్థానిక ప్రజాప్రతినిధులు వాటాలు అండ తో నడుస్తుండ గా మరికొన్ని బడాబాబుల బినామిలు నిర్వహిస్తున్నారు.ఇక్కడ అమ్మే మద్యం నకిలిదా అసలుదా అన్న అనుమానాలు కూడాఉన్నాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెల్టు షాపులు కొన్నింటిలో హ్ రోజుకు 50 వేల నుండి లక్ష వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడ “కోవిడ్19” నిబంధనలు అమలు జరగడం లేదు. సామాజిక దూరం,మాస్కులు అనేవి కనిపించవు. నగరం లో రెడ్ జోన్ గా ఉన్న మామిళ్లగూడెం రామాలయం సమీపం లోనే బారి బెల్ట్ షాప్ ఉంది.అమ్మకాలు సాగుతున్నాయి.

బెల్టుషాపులు కొన్ని

-ఖమ్మం నగరం లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అల్లిపురం రోడ్డు అనుకోని ఉన్న మమత బైపాస్ ఆరంభం లో ముందు వైపు కిరాణా షాప్ వెనుక బెల్టు షాప్ సిట్టింగ్ ఉంది.రోజుకు 50వేల రూపాయల మద్యం అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయి అని సమాచారం.

-అగ్రహారం గేటు సమీపం లో ముందు వైపు పాన్ షాప్ వెనుక బెల్ట్ షాప్ నడుస్తోంది .

-శ్రీరామ్ హిల్స్ సమీపం లో ఉన్న భోజనం హోటల్ వెనుక బార్ల ను మై మరిపించే విధంగా సిట్టింగ్ ఉంది

-నాయుడు పేట నుండి బైపాస్ రింగ్ కు వెళ్లే మార్గం లోని బారి సిట్టింగు బెల్ట్ షాప్ లో రోజు కు లక్ష వరకు వ్యాపారం ఉంది అన్నది సమాచారం.

-ఖమ్మం డిఆర్ డీఏ రోడ్డు లోని ఒక వైన్ షాప్ పర్మిట్ రూము పక్కన ముందుచిల్లి షాప్ వెనుక పెయిడ్ సిట్టింగ్ ఉంది.

-చింతకాని మండలం రాంకిష్టపురం సమీపంలో పెట్రోలు బంకు వద్ద ముందు హోటల్ వెనుక సిట్టింగ్ బెల్ట్ షాప్ నడుపుతున్న రు. ఇటువంటివి అనేకం ఉన్నాయి.
-పై వాటితో పాటు కొన్ని చోట్ల మందు,విందు,పొందు ఒకేచోట ఉన్నకేంద్రాలు వాటిలో లాడ్జి లు కూడా ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద సిట్టింగ్ కు అనుమతిస్తున్న కొన్ని బెల్ట్ షాప్ లు కరోన వ్యాప్తి కేంద్రాలు మారాయి .అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.