రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క

అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్

0
TMedia (Telugu News) :

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క

– అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్

టీ మీడియా, నవంబర్ 22, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గం నుండి నామినేషన్ వేసి నిరుద్యోగులు యువత తరపున పోరాడుతున్న బర్రెలక్క (శిరీష) కు మద్దతు తెలిపిన ఆఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ . మంగళవారం తనపై జరిగిన దాడిని ఖoడించడానికి వనపర్తి నుండి అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఫాదర్ భాష, స్వేచ్ఛ జేఏసి కన్వీనర్ బుల్లి ఆడం రాజ్, పుట్టపాక బాలస్వామి, చుక్కయ్య శెట్టీ, తదితరులు వెళ్లి ఆమెకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు లేనిది రాజకీయం చేయలేము అని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులను ఎదిరించడానికి ఎవరు ధైర్యం చేయని పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ ముందుకు వచ్చి బలవంతుల మధ్య నామినేషన్ వేసి ఒక ఛాలెంజ్ విసిరిందని.

Also Read : ఇజ్రాయెల్‌తో అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పు

ఆమెకు వస్తున్న ఆదరణ చూసి కొందరు ఆమెను భయపెట్టాలని దాడి చేయాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక సాగవని, రాష్ట్రం మొత్తం బర్రెలక్క వైపే ఉందని ఆమెను గెలిపించడానికి డబ్బు అక్కర్లేదని అభిమానం ఉంటే చాలని కనుక కొల్లాపూర్ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ఈ సమాజాన్ని మార్చే విధంగా తీర్పుని ఇవ్వాలని కోరుకుంటున్నాము.జై బర్రెలక్క విజిల్ గుర్తుకే ఓటేయండి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube