ప‌ది’లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే బాస‌ర‌ ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు

ప‌ది’లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే బాస‌ర‌ ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు

1
TMedia (Telugu News) :

ప‌ది’లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే బాస‌ర‌ ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు

టి మీడియా,జూన్ 14,ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ‌విద్యాల‌యం( ట్రిపుల్ ఐటీ, బాస‌ర‌) లో ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ఈ మేర‌కు బాస‌ర ట్రిపుల్ ఐటీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది.

Also Read : అధికార పార్టీ క్రైమ్ కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయాలి

అయితే కోవిడ్ కార‌ణంగా గ‌త విద్యా సంవ‌త్స‌రం ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నందున‌, పాలీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు క‌ల్పించారు. కానీ ఈ విద్యా సంవ‌త్స‌రం మాత్రం టెన్త్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని యూనివ‌ర్సిటీ ప‌రిపాల‌నాధికారి డాక్ట‌ర్ వై రాజేశ్వ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube