బస్తీ దవాఖానలు కావవి.. దోస్తీ దవాఖానలు : మంత్రి హరీశ్‌రావు
బస్తీ దవాఖానలు కావవి.. దోస్తీ దవాఖానలు : మంత్రి హరీశ్‌రావు
బస్తీ దవాఖానలు కావవి.. దోస్తీ దవాఖానలు : మంత్రి హరీశ్‌రావు
టీ మీడియా, ఫిబ్రవరి 15, సిద్దిపేట : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన బస్తీదవాఖానలు స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు అందుబాటులో నెలకొల్పిన బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని అభివర్ణించారు. సిద్దిపేట పట్టణం16వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో బుధవారం బస్తీ దవాఖాన ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. సిద్దిపేటలో పాలియేటివ్ కేర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బస్తీ దవాఖాల వల్ల పేదల ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. ఈ దవాఖానల్లో 158రకాల మందులు ఇచ్చి, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని వెల్లడించారు. త్వరలోనే 137 రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. వైద్యుల సలహాల మేరకు మందులు వాడితే దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. హైదరాబాద్ లో 354 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
Also Read : కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు
సిద్దిపేట లో 5 బస్తీ దవాఖాన లు ఉన్నాయని అన్నారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని , ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీపీ,షుగర్ రోగులకు ఎన్ సీడీ కిట్ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube