బతుకమ్మ సంబరాలలో ఆడి పాడిన జడ్పిటిసి, సర్పంచ్ “

బతుకమ్మ సంబరాలలో ఆడి పాడిన జడ్పిటిసి, సర్పంచ్ "

1
TMedia (Telugu News) :

బతుకమ్మ సంబరాలలో ఆడి పాడిన జడ్పిటిసి, సర్పంచ్

ముదిగొండ మండలం ముదిగొండ హైస్కూల్లో బతుకమ్మను
తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆనందోత్సాహాల మధ్య విద్యార్థులతో ఆడిపాడిన జడ్పిటిసి పసుపులేటి దుర్గ వెంకట్ , ముదిగొండ సర్పంచ్ మందారపు లక్ష్మీ వెంకన్న. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఉట్టిపడే విధంగా పట్టు వస్త్రాలను ధరించి అందంగా ముస్తాబై బతుకమ్మలను తీసుకువచ్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ పాటలకు చిన్నారులతో కలిసి కోలాటం వేసిన జడ్పిటిసి, సర్పంచ్ బతుకమ్మ పాటలకు చిన్నారుల అడుగులో అడుగు వేస్తూ వారిని ఉత్తేజపరిచారు. సంస్కృతి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరించి చిన్నారులు పలువురిని ఆశ్చర్యానికి గురి చేశారు. చిట్టి చిట్టి అడుగులతో నృత్యం చేస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తామే నిలువెత్తు అని నిరూపించారు.

alsoread :ముఖ్యమంత్రి ‘బతుకమ్మ’ ఉత్సవాలశుభాకాంక్షలు

 

ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పసుపులేటి దుర్గ వెంకట్ మాట్లాడుతూ పూర్వకాలం నుండి బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టత కలిగిందని,తీరొక్క పూలతో మహిళలు అందంగా అమర్చి అందరూ ఒక చోట చేరి సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా కాపాడుకునే విధంగా ప్రాచీనం నుండి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుందని, పిల్లలకు తల్లిదండ్రులు చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందని పండుగల మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ మంచి గుర్తింపు తీసుకొచ్చిందని, దీనిలో భాగంగానే చరిత్ర నేర్పేందుకు సంస్కృతిని తెలియజేసేందుకు పాఠశాల యందు కార్యక్రమాన్ని సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ సర్పంచ్ లక్ష్మి వార్డు నెంబర్ సత్యవాణి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube