మేడేపల్లి లో ఘనంగా సద్దులబతుకమ్మ సంబరాలు

మేడేపల్లి లో ఘనంగా సద్దులబతుకమ్మ సంబరాలు

0
TMedia (Telugu News) :

మేడేపల్లి లో ఘనంగా సద్దులబతుకమ్మ సంబరాలు

 

బ్రతుకునిచ్చే బతుకమ్మల నడుమ దుర్గామాతకు ప్రత్యేక పూజలు.

కోలాట నృత్యాలతో బతుకమ్మల ఊరేగింపు.
~~~~~~~

తెలంగాణా సంసృతీ,సాంప్రదాయాలకు మహిళల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమైన బతుకు నిచ్చే బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని మేడేపల్లి గ్రామంలో సద్దులబతుకమ్మ సందర్భంగా భారీ బతుకమ్మలను పేర్చారు.మహిళలు బ్రతుకు నిచ్చే బతుకమ్మల నడుమ దుర్గామాత ప్రతిమ ఉంచి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఒకే రంగు చీరలు ధరించిన మహిళలందరూ బతుకమ్మల చుట్టూ కోలాట నృత్యాలు చేస్తూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

 

ALSO READ :కాకతీయ కలాతోరణం కూల్చి వేత

 

సోమవారం సాయంత్రం మేడేపల్లి గ్రామంలో సద్దులబతుకమ్మ సంబరాల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యడవల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్ మేడిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆటాపాటలు,నృత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మేడిశెట్టి లక్ష్మయ్య,వీర రాఘవమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన మేడిశెట్టి నరసింహారావు బహుమతులు అందజేశారు.ప్రజలందరూ ఐక్యంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం హర్షిణీయమని ఆయన అభినందించారు.గ్రామ ప్రజల ఐక్యతే పరమార్ధంగా మంచి కార్యక్రమాలు నిర్వహించే వారిని అందరూ ప్రోత్సహిస్తూ,అభినందించాలని ఆయన సూచించారు.గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని,దుర్గామాత చల్లని దీవెనలతో గ్రామ ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని,గ్రామంలో పాడిపంటలు విలసిల్లాలని,అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించే విజయమే ‘విజయదశమి’ అంటూ గ్రామ ప్రజలందరికీ ఆయన విజయదశమి(దసరా) శుభాకాంక్షలు తెలియజేశారు.

ALSO READ :కార్పొరేటర్ కర్నాటి అధ్వర్యంలో చిన్నారుల బ్రతుకమ్మ సంబరాలు

మహిళలు,చిన్నారులు బతుకమ్మల చుట్టూ చక్కటి కోలాట నృత్యాలు చేసిన అనంతరం మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని ఆనందోత్సాహాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.బతుకమ్మల ఊరేగింపు సందర్భంగా పులిహోర ప్రసాదాన్ని గ్రామంలో అందజేశారు.డీజే నృత్యాలు,కోలాటం పాటల నడుమ సాగిన ఊరేగింపు అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళలు బండారు యమునా, ఓర్సు బాలమ్మ, కుంచం త్రివేణి, సునీత,రమణ మోర వాసవి రాణి,శ్రీదేవి,భవాని గుండుఉమ,రమాదేవి,పొన్నం మల్లిక మరియు కుంచం లింగయ్య,ఓర్సు నాగేశ్వరరావు,బొంత నాగరాజు,బండారు శ్రీను,మోర కృష్ణయ్య,బొంత ఉపేందర్,మోర వెంకటరామారావు,గుండు వెంకటేశ్వర్లు, పోలగాని సాయి,మోర రమేష్,వంగ వీరబాబు,పగిళ్ల సాయి,మోర సాయి చైతన్య గుణగంటి వీరభద్రం గౌడ్,గుండు శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube