జనహిత బతుకమ్మ సంబరాలు

జనహిత బతుకమ్మ సంబరాలు

1
TMedia (Telugu News) :

జనహిత బతుకమ్మ సంబరాలు

 

టీ మీడియా ,సెప్టెంబర్‌ 30, బెల్లంపల్లి: నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణం ఏ.ఎమ్.సి గ్రౌండ్లో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో డి.జే పాటలు వద్దు – బతుకమ్మ పాటలు ముద్దు అనే నినాదంతో నిర్వహిస్తున్న జనహిత బతుకమ్మ సంబరాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణ & మండల స్థాయి బతుకమ్మ పాటల పోటీల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య.

Also Read : దళితబంధు దళితులకు అ౦డగా

ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవ లో ఎల్లప్పుడూ ముందుండే జనహిత సేవా సమితి వారు బతుకమ్మ పాటలను ప్రోత్సహించడానికి దసరా పండగ సందర్భంగా బతుకమ్మ పాటల పోటీల కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని, రానున్న కాలంలో కూడా వారు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి తాను అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

తదనంతరం జనహిత అధ్యక్షుడు అడెపు సత్తీష్ ను సన్మానించారుఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనహిత సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube