ఈ నెల 21న సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు
టీ మీడియా, అక్టోబర్ 12, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న సింగపూర్‌లో పూలపండుగ వైభవంగా జరుగనుంది. దీనికి సంబంధించి సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాట్లు చేస్తున్నది. అక్టోబర్ 21న సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్‌లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఆడపడుచులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహాకురాలు కురిచేటి స్వాతి కోరారు. ప్రఖ్యాత గాయని వరమ్ ప్రత్యక్ష గానం.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందని ఎస్‌టీఎస్ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పూల పండుగలో పాల్గొనేవారందరి కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Also Read : షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం
అదేవిధంగా ఆకర్షణీయమైన బతుకమ్మలకు మూడు ప్రత్యేక బహుమతులు, లక్కీ విజేతకు 5 గ్రాముల బంగారం బహుమతిగా ఇస్తున్నామని కార్యదర్శి పొలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రవాణ సౌకర్యం కూడా (బస్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube